ఎస్‌ఆర్‌ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్… ‘శివన్‌’

374
Shivan Teaser
- Advertisement -

కల్వకోట సాయితేజ-తరుణీసింగ్ జంటగా ఎస్.ఆర్.సినీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి శివన్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ.. యువ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డి లింగాల నిర్మిస్తున్న లవ్ థ్రిల్లర్ ‘శివన్. ‘ది ఫినామినల్ లవ్ స్టోరీ’ అన్నది ట్యాగ్ లైన్. షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్ అత్యంత సందడిగా హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన కార్యక్రమంలో విడుదలైంది.

ప్రముఖ నిర్మాతలు రాజ్ కందుకూరి, వల్లూరిపల్లి రమేష్ బాబు, ప్రముఖ దర్శకులు వి.ఎం.ఆదిత్య, ఆనంద్ రవి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. చిత్ర నీరంతా లింగాల సంతోష్ రెడ్డి, చిత్ర దర్శకుడు శివన్, సహ నిర్మాత వున్నా మురళి(బిట్టు), హీరో కల్వకోట సాయితేజ్, హీరోయిన్ తరుణీసింగ్, సంగీత దర్శకుడు సిద్ధార్ధ సదాశివుని, సినిమాటోగ్రఫేర్ మీరన్, ఎడిటర్ రామ్ సతీష్, ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు, ఇతర పాత్రల్లో నటించిన మహేంద్ర, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

దర్శకుడు శివన్ చెప్పిన కథ నచ్చి నిర్మాతగా మారానని, మిత్రుడు బిట్టుతో పాటు ప్రతి ఒక్కరు ఈ చిత్రం కోసం ఏంటో అంకితభావంతో పని చేసి, అద్భుతమైన అవుట్ ఫుట్ ఇచ్చారని చిత్ర నిర్మాత లింగాల సంతోష్ రెడ్డి అన్నారు.

టీజర్ చూస్తుంటే.. చాలా పెద్ద హిట్ అయ్యేలా ఉందని, ఉరకలెత్తించే ఉడుకు రక్తం కలిగిన కుర్రాళ్లంతా కలిసి తీసిన ‘శివన్’ గురించి అందరూ మాట్లాడుకునేంత గొప్పగా ఉందని, తమ సినిమాకు ‘ది ఫినామినల్ లవ్ స్టోరీ’ అనే టాగ్ లైన్ పెట్టుకోవడానికి గట్స్ కావాలని, రియల్ ఎస్టేట్ నుంచి సినిమా రంగంలోకి వస్తున్న సంతోష్ రెడ్డి ఈ రంగంలోనూ సక్సెస్ అవ్వాలని అతిధులు రాజ్ కందుకూరి, వల్లూరిపల్లి, వి.ఎన్, ఆదిత్య, ఆనంద్ రవి అన్నారు. నిర్మాతలు సంతోష్ రెడ్డి, వున్నా మురళితో పాటు టీమ్ సహాయ సహకారాల వల్లే ‘శివన్’ సినిమా ఇంట బాగా వచ్చిందని దర్శకుడు శివన్ అన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు సహ నిర్మాత వున్నా మురళి (బిట్టు) కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ పాప్ సింగర్ మధు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

సి.వి.ఎల్, ఆశ్రిత ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రామ్ సుంకర-సుబ్బు నాంబా, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటిప్స్: సూర్య బైసాని-వేదకుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శంకర్, కో ప్రొడ్యూసర్: వున్నామురళి (బిట్టు), నిర్మాత: సంతోష్ రెడ్డి లింగాల, రచన-దశకత్వం: శివన్!!

- Advertisement -