“మహాసముద్రం”లో నాగచైతన్య

145
Ajay Bhupathi chaitanya

అక్కినేని నాగచైతన్య, సమంత కాంబినేషన్ లో వచ్చిన సినిమా మజిలి. నాగచైతన్య కెరీర్ లోనే ఈమూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు.. చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న చైతూకి ఈసినిమా మంచి బ్రేక్ గా చెప్పుకోవచ్చు.. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈమూవీ బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈసినిమా తర్వాత నాగచైతన్య చేస్తున్న చిత్రం వెంకీమామ.

వెంకటేశ్, నాగచైతన్య కలిసి ఈసినిమాలో నటిస్తున్నారు. ఈమూవీకి బాబీ దర్శకత్వం వహించగా..సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దగ్గుబాటి సురేష్ బాబు, కొన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఈసినిమా తర్వాత చైతూ ఆర్ఎక్స్ 100దర్శకుడు అజయ్ భూపతితో మూవీ చేయనున్నాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నాడట దర్శకుడు అజయ్ భూపతి. ఈమూవీలో చైతూ పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈసినిమాకు మహాసముద్రం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఆర్ఎక్స్ 100లాంటి సినిమా భారీ హిట్ కొట్టిన దర్శకుడు నాగచైతన్యతో ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడని వెయిట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. ఈమూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.