ఒకే ఓవర్‌లో 6 ఫోర్లు…షాపై ప్రతీకారం తీర్చుకున్న మావి..!

180
shah
- Advertisement -

ఐపీఎల్ 14లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్బుతం ఆవిష్కృతమైంది. తొలి ఓవర్‌లోనే పృథ్వి షా…శివమ్ మావి బౌలింగ్‌లో ఆరు ఫోర్లు కొట్టి సంచలనం సృష్టించాడు. కేవ‌లం 41 బంతుల్లో 82 ప‌రుగులు చేసి ఢిల్లీని విజయతీరాలకు చేర్చాడు.

అయితే మ్యాచ్‌ అనంతరం పృథ్వి షాపై ప్రతీకారం తీర్చుకున్నాడు శివమ్ మావి. సీరియస్‌గా కాదు. నా ఓవ‌ర్‌లోనే ఆరు ఫోర్లు కొడ‌తావా అంటూ పృథ్వి మెడను గ‌ట్టిగా ప‌ట్టుకున్నాడు మావి. ఈ వీడియోను ఐపీఎల్ త‌న ట్విట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఐపీఎల్‌ గొప్పతనం,స్పొర్టింగ్ స్పిరిట్ ఇదేనని పేర్కొంది.ఐపీఎల్‌లో ఒకే ఓవ‌ర్‌లో ఆరు ఫోర్లు కొట్టిన రెండో బ్యాట్స్‌మ‌న్ పృథ్వీ షా. గ‌తంలో ర‌హానే ఈ ఘ‌న‌త సాధించాడు.

- Advertisement -