కోల్‌కతాపై టాస్‌ గెలిచిన ఢిల్లీ..

141
DC
- Advertisement -

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య రసవత్తర పోరు జరగుతోంది. కోల్‌కతాపై టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఢిల్లీ జట్టులో స్పిన్నర్ అమిత్ మిశ్రా గాయపడటంతో అతని స్థానంలో లలిత్ యాదవ్ టీమ్‌లోకి వచ్చాడు. మరోవైపు కోల్‌కతా జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతోంది. ఢిల్లీ వరుస విజయాలతో దూసుకెళ్తుండగా కోల్‌కతా తడబడుతోంది.

ఐపీఎల్‌లో ఢిల్లీ, కోల్‌కతా హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. కోల్‌కతాదే పైచేయి. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 26 మ్యాచ్‌ల్లో తలపడగా.. 14 మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించింది. 11 మ్యాచ్‌ల్లో ఢిల్లీ విజయం సాధించగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

తుదిజట్లు :
Kolkata Knight Riders (Playing XI): Shubman Gill, Nitish Rana, Rahul Tripathi, Sunil Narine, Eoin Morgan(c), Andre Russell, Dinesh Karthik(w), Pat Cummins, Shivam Mavi, Prasidh Krishna, Varun Chakravarthy

Delhi Capitals (Playing XI): Prithvi Shaw, Shikhar Dhawan, Steven Smith, Rishabh Pant(w/c), Marcus Stoinis, Shimron Hetmyer, Axar Patel, Lalit Yadav, Kagiso Rabada, Ishant Sharma, Avesh Khan

- Advertisement -