14న లారెన్స్ ‘శివ లింగ‌’

135
Shivalinga Movie Released on 14th

అభిషేక్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై రాఘ‌వేంద్ర లారెన్స్‌, రితిక సింగ్ హీరో హీరోయిన్లుగా పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో ర‌మేష్ పి.పిళ్లై నిర్మించిన చిత్రం `శివ‌లింగ‌`. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలోసుర‌క్ష్ ఎంట‌ర్‌టైన్మెంట్ మీడియా అధినేత మ‌ల్కాపురం శివ‌కుమార్‌, నిర్మాత ర‌మేష్ పిళ్ళై పాత్రికేయుల‌తో మాట్లాడారు.

Shivalinga Movie Released on 14th

మల్కాపురం శివ కుమార్ మాట్లాడుతూ.. శివలింగ సినిమా చూశాను. చాలా బాగుంది.హార్రర్ సినిమాల్లో ఇది నెక్ట్స్ లెవెల్ లో ఉండే చిత్రమిది. తెలుగులో మా సురక్ష బ్యానర్ ద్వారా విడుదల చెస్తున్నాము.కాంచ‌న‌, గంగ చిత్రాల స‌క్సెస్‌ల‌తో లారెన్స్ న‌ట‌నేంటో తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలిసింది. క‌న్న‌డంలో శివ‌రాజ్‌కుమార్ హీరోగా వాసు ద‌ర్శ‌క‌త్వంలో క‌న్న‌డంలో రూపొందిన శివ‌లింగ చిత్రం అక్క‌డ పెద్ద స‌క్సెస్ కావ‌డంతో తెలుగు, త‌మిళంలో లారెన్స్‌, రితిక సింగ్‌ల‌పై అభిషేక్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ర‌మేష్ పిళ్లై నిర్మించారు. రీసెంట్‌గా గురు చిత్రంతో స‌క్సెస్ సాధించిన రితిక సింగ్ హీరోయిన్‌గా న‌టించిన చిత్ర‌మిది. హ‌ర్ర‌ర్‌, స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్‌, యాక్ష‌న్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్ర‌మిది. త‌ప్ప‌కుండా తెలుగు ప్రేక్ష‌కులకు నచ్చేలా సినిమా ఉంటుందని తెలిపారు.

క‌న్న‌డ‌లో శివ‌లింగ పేరుతో శివ‌రాజ్‌కుమార్‌ న‌టించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో లారెన్స్‌, రితిక సింగ్‌ల‌తో రీమేక్ చేశాం. వాసు ద‌ర్శ‌క‌త్వంలోనే సినిమా రూపొందింది. సినిమాలో అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమాలో ఐదు సాంగ్స్ ఉన్నాయి. లారెన్స్‌కి కాంచ‌న కంటే మంచి పేరు తెచ్చే చిత్ర‌మ‌వుతుందని అభిషేక్ ఫిలింస్ అధినేత ర‌మేష్ పిళ్ళై చెప్పారు.