నగరంలో పలుచోట్ల వర్షం…

120
Rain in Hyderabad
Rain in Hyderabad

హైదరాబాద్ నగర ప్రజలు వేసవితాపం నుంచి ఇవాళ కాస్త ఉపశమనం పొందారు. నిన్నా మొన్న ఎండలతో హాట్ హాట్ గా ఉన్న నగరం మధ్యాహ్నం తరువాత కాస్త చల్లబడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మసాబ్ ట్యాంక్, పంజాగుట్ట, ఖైరతాబాద్, రాంనగర్, విద్యానగర్, అంబర్‌పేట, రామాంతపూర్, బాగ్ లింగంపల్లి, అశోక్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది.

ఉక్కబోత, హై టెంపరేచర్ తో ఇబ్బందిపడ్డ సిటీవాసులకు చిరుజల్లులు కాస్త ఉపశమనం ఇచ్చాయి. వర్షం కురిసిన ప్రాంతాల్లో వెదర్ కూల్ గా మారితే మిగతాచోట్ల ఆకాశం మేఘావృతం కావడం.. చల్లటి గాలులు వీచడంతో సిటీ జనం కాస్త రిలీఫ్ గా ఫీలవుతున్నారు. కాగా, వర్షం నీటి కారణంగా పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచి పోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.