శివకార్తికేయన్…’మహావీరుడు’

33
- Advertisement -

హీరో శివకార్తికేయ, మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న పొలిటికల్ డ్రామా మహావీరుడు. అదితి శంకర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శాంతి టాకీస్‌ పతాకంపై అరుణ్‌ విశ్వ నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది.

ట్రైలర్ లోకి వెళితే.. శివకార్తికేయన్ వార్తాపత్రికలో పనిచేసే కార్టూనిస్ట్ పాత్రను పోషిస్తున్నారు. అనుకోకుండా ఓ రాజకీయ నాయకుడి పోస్టర్ చించడం వలన ఇబ్బందుల్లో పడతాడు. ఇందులో ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా వున్నాయి. శివకార్తికేయన్ పైకి చూసినపుడు భిన్నమైన వ్యక్తిగా మారడం ఆసక్తికరంగా వుంది. ట్రైలర్ చాలా ఎక్సయిటింగా వుంది.

డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో శివకార్తికేయన్ అద్భుతమైన నటనను కనబరిచాడు. మిస్కిన్ విలన్‌గా నటించగా, సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రానికి ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌. విధు అయ్యన్న కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రంలో యోగి బాబు, సరిత వంటి స్టార్ తారాగణం కూడా ఉంది.

Also Read:చంద్రబాబు పవన్ మధ్య క్లాష్..తప్పదా?

ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. జూలై 14న మహావీరుడు విడుదల కానుంది.

Also Read:కొర్రలు తింటే.. ఎన్ని ఉపయోగాలో!

- Advertisement -