‘మా’ ఆరోపణలపై…శివాజీ సవాల్‌.

183
MAA

నటుడు శివాజీ రాజా…సవాల్ విసిరారు. ‘మా’ నిధులను దుర్వనియోగం చేశారంటూ..గత కొన్ని రోజులుగా ఆరోపణలు రావడంపై రియాక్ట్‌ అయ్యారు శివాజీ. ‘మా’ అసోషియేషన్ లో 5 పైసలు దుర్వినియోగమైనా..తన ఆస్తినంతా రాసిస్తానని సవాల్ విసిరారు.

Shivaji Raja ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు శివాజీ రాజా. అయితే ఇన్నట్టుండి సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో వివాదం తలెత్తడంతో..‘మా’ కార్యవర్గం ఈరోజు సమావేశమై చర్చించింది.
Movie Artists Associationఈ సమావేశానికి ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యుడు శ్రీకాంత్‌ హాజరయ్యారు. సమావేశమనంతరం.. ‘మా’నిధు లు దుర్వినియోగం అయ్యాయంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, నిధులు దుర్వినియోగం చేసినట్లు ఎవరైనా నిరూపిస్తే అసోసియేషన్‌ నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు.

సిల్వర్‌ జూబ్లీ వేడుకలకు ఒప్పందం ప్రకారమే డబ్బు వసూలైందని, వేడుకల ద్వారా వచ్చే డబ్బులతో ‘మా’ అసోసియేషన్‌ నిర్మించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చెప్పుకొచ్చారు. కాగా..అసోసియేషన్‌ ఎన్నికలు సమీపిస్తున్నందున ఉద్దేశపూర్వకంగానే తమపై ఆరోపణలు చేస్తున్నారని శివాజీరాజా వ్యాఖ్యానించారు.