అడివి సాయికిర‌ణ్ డైరెక్షన్‌లో ‘ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్‌’

223
- Advertisement -

శ‌షా చెట్రి(ఎయిర్ టెల్ మోడ‌ల్‌) ,ఆది సాయికుమార్, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్, మ‌నోజ్ నందం, కృష్ణుడు, అబ్బూరి ర‌వి, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ కీల‌క పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్‌’. వినాయ‌కుడు టాకీస్ బ్యాన‌ర్‌పై య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించిన క‌ల్పిత కథాంశంతో.. వినాయ‌కుడు, విలేజ్‌లో వినాయ‌కుడు, కేరింత వంటి సెన్సిబుల్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అడివి సాయికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గేరి బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు.

Operation Gold Fish Movie

ఓ సినిమాలో ప‌నిచేసే యూనిట్ స‌భ్యులంద‌రూ క‌లిసి ఓ సినిమా నిర్మాణంలో భాగ‌మ‌వ‌డం ఇదే తొలిసారి. అలాగే ఎయిర్టెల్ 4జీ గర్ల్‌గా పాపులర్ అయిన శషా చెట్రి ఈ సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నారు. బొమ్మరిల్లు, కిక్, ఎవడు, మిస్టర్ పర్ఫెక్ట్, గూఢచారి లాంటి చిత్రాలకు రచయితగా పని చేసి, కమలహాసన్, మరియు తమిళ్ శంకర్‌తో కూడా పనిచేసిన స్టార్ రైటర్ అబ్బూరి రవి ఈ చిత్రానికి రచయితగానే కాకుండా, మొట్ట మొదటి సారిగా పవర్ ఫుల్ విలన్ పాత్రని ఈ చిత్రంలో పోషిస్తున్నారు.

Operation Gold Fish Movie

అతడు సినిమాలో యంగ్ మహేష్ బాబుగా, చత్రపతి సినిమాలో యంగ్ ప్రభాస్ గాను, తనదైన గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ నందం ఈ సినిమాలో ఒక స్టైలిష్ విలన్‌గా కనపడతాడు. ఇంకా, పోకిరి, హ్యాపీడేస్ లాంటి చిత్రాలలో ముఖ్య పాత్రలు పోషించి, వినాయకుడుతో హీరోగా అలరించిన క్రిష్ణుడు ఈ చిత్రంలో ఒక విచిత్రమైన కామెడీ పాత్రని పోషిస్తున్నారు. ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రి ఈ సినిమాకు సాహిత్యాన్ని అందిస్తున్నారు.

Operation Gold Fish Movieఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌ర‌పుకుంటుంది. ఈ చిత్రాన్ని కాశ్మీర్, ఢిల్లీ, లంబసింగి, ఏ.ఓ.బీ, చింతపల్లి, అరకు, కాకినాడ పోర్ట్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో సినిమా షూటింగ్ చేశాం. ఓ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. జ్ఞాన శేఖర్ దగ్గర సెకెండ్ యూనిట్ కెమరామెన్‌గా వేదం ,కృష్ణంవందే జగత్గురుం, కంచే, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలకి పనిచేసిన జైపాల్ రెడ్డి ఈ సినిమాకు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా… క్షణం, PSV గరుడవేగ, గూఢచారి సినిమాలకి స్వరాలు సమకూర్చి మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్‌తో ఒక ఇండిపెండెంట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకి సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు.

Operation Gold Fish Movie

అలాగే క్షణం, గూఢచారి సినిమాలకి ఎడిటర్ గా గుర్తింపు తెచ్చుకున్న గేరి.బిహెచ్ ఈ సినిమాకి ఎడిటింగ్ చేస్తున్నారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్ దగ్గర పనిచేసి కృష్ణార్జునయుద్ధం, రాజా ది గ్రేట్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రామక్రిష్ణ మరియు గూఢచారి యాక్షన్ కోరియోగ్రాఫెర్ గా చేసిన సుబ్బు రాబిన్, నాభ కూడా ఈ సినిమాకి యాక్షన్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. మంచి ఆర్టిస్టుల‌తో పాటు, టెక్నిక‌ల్ టీం కుదిరింది. ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తామ‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నాం“ అన్నారు.

- Advertisement -