‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో నాగబాబు..?

260
Naga Babu
- Advertisement -

ప్రస్తుతం సీనియర్ నటీనటులు, రాజకీయ నాయకుల జీవిత చరిత్రలను బయోపిక్‌గా తెరకెక్కించే పనిలో పడ్డారు టాలీవుడ్ దర్శక, నిర్మాతలు. ఇటీవలే అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందించిన సినిమా ‘మహానటి’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విడుదలై ప్రమఖుల నుంచి ప్రశంసలందుకుంటోంది. ఇక లెజండరీ యాక్టర్, మాజీ సీఎం దివంగత నందమూరి తారక రామారావు బయోపిక్‌ను ‘ఎన్టీఆర్’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన చిత్రీకరణ చకచకా కొనసాగుతోంది.

Naga Babu

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా చంద్రబాబు నాయుడు పాత్రను రానాతో చేయిస్తున్నారు. ఇక ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్రను విద్యాబాలన్‌ పోషిస్తున్నారు. శ్రీదేవి పాత్రలో రకుల్, జయప్రద పాత్రలో రాశిఖన్నా నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రముఖుల పాత్రలను ప్రముఖ నటినటులతో చేయిస్తున్న కారణంగా సినిమాపై సాదారణ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం నాగబాబును ఎంపిక చేసినట్లుగా సినీ వర్గాల సమాచారం.

ఈ సినిమాలో ఎస్వీ రంగారావు పాత్రలో ‘నాగబాబు’ను తీసుకోనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ‘మహానటి’ సినిమాలో ఎస్వీరంగారావు పాత్రను మోహన్ బాబు అద్భుతంగా పోషించారు. ఎన్టీఆర్‌తో మోహన్ బాబుకి గల ప్రత్యేకమైన అనుబంధం కారణంగా, ‘ఎన్టీఆర్’ బయోపిక్ లోను ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు కనిపించే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ ‘మహానటి’లో చేసినవాళ్లనే తీసుకుంటే కొత్తదనాన్ని ఆడియన్స్ మిస్ అవుతారనే ఉద్దేశంతో నాగబాబును సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది.

The shooting of Balakrishna’s prestigious film, NTR biopic on NTR has intensified. It is known that Director Krish is directing the film..

Balakrishna,Naga Babu,Mega Brother,NTR biopic,Director Krish,SVR,Naga Babu in NTR Biopic,Tollywood Breking news,

- Advertisement -