చర్చిలో శివ నామ స్మరణ

129

చర్చిలో ఓం నమః శివాయ మంత్రం మార్మోగింది. అదేంటీ చర్చిలో శివనామస్మరణ ఏంటీ అనుకుంటున్నారా..అవను నిజమే..అయితే ఇది మన దగ్గర కాదు రష్యాలో. ఇప్పుడు నెట్టింట్లో ఈ వీడియో తెగవైరలైంది.

మాటే మంత్రం అన్నారు. అంటే ఒక అక్షరాన్నైనా పద్ధతి ప్రకారం పలకడం వల్ల గొప్ప శక్తి వస్తుందని చెప్తూ ఉంటారు. సనాతన ధర్మంలో మహర్షులు మంత్రాల ద్వారా అద్భుత శక్తులను సాధించిన సంగతులు అనేకం ఉన్నాయి. దీనికి మరో నిదర్శనమే రష్యాలోని ఓ చర్చిలో వినిపించిన పంచాక్షరి మంత్రం.

రాక్ బ్యాండ్ ప్లేయర్ ‘ఓం నమః శివాయ’ , ‘గం గణపతయే నమః’ అని రాగయుక్తంగా ఆలపిస్తూ ఉంటే ప్రేక్షకులు తన్మయత్వంతో కోరస్‌గా ఆలపించారు. చప్పట్లు కొడుతూ, ఈ మంత్రాలను జపిస్తూ భక్తి భావంతో పరవశించారు. ఇవి చర్చి లోపల పాడినట్లుగా వీడియోలో ఉంది.కాగా, ఓం నమః శివాయ, ఓం గణ్ గణపతయే నమః హిందువుల పవిత్ర శ్లోకాలు. ఈ శ్లోకాలు సంస్కృతంలో ఉంటాయి.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోను చూసిన భారత నెటిజన్లు.. ఇది ఇండియా గర్వపడాల్సిన విషయం, రష్యాకు ధన్యవాదాలు, అద్భుతం అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. 2015లో రష్యా ప్రధాని మోడీ రష్యాలో పర్యటించినప్పుడు గాయని గజనోవా గణేష్ మంత్రాన్ని పఠించారు. ఆ వీడియో మీకోసం..

Shiva – Ganapathi ..stotra at Russian Church.