ఛాన్స్ ఇప్పించా.. మరి నాకేంటన్న హీరో

109
Actress Archana Revealed Shocking Facts

ఒక్క ఛాన్స్‌…ఒకే ఒక్క ఛాన్స్ ఖడ్గం సినిమాలో ఈ డైలాగ్ చాలా పాపులర్. ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఇండస్ట్రీలో ఎంతకైనా తెగించాల్సి వస్తుందని గతంలో కొంతమంది హీరోయిన్స్ బయటపెట్టిన సంగతి తెలిసిందే. వెండితెర వెలుగులు… తెర ముందు మాత్రమే. కానీ, నటీనటులు చీకటి కష్టాలు తెరవెనుక అన్నీఇన్నీకావు. వెండితెరపై కనిపించాలన్న ఒకేఒక్క ఆశతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ నానా కష్టాలు ఎదుర్కోవాల్సింది. ఈ కష్టాలకు ఏ ఒక్కరూ అతీతం కాదు.ఇలాంటి పరిస్ధితి ఎవరికి అతీతం కాదు.

సినిమా ఛాన్సులు దొరికినప్పటికీ.. స్టార్‌డమ్ వచ్చేంత వరకు ఎన్నో చీకటి కష్టాలు తప్పవు. ఏ మాత్రం తిరగబడిన ఇక ఛాన్సులే ఉండవు. దీంతో హీరోయిన్ల జీవితాల్లో అడుగడుగునా ఎన్ని అవమానాలు, విషాదాలు ఉంటాయన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. అలాంటి ఇబ్బందులు తనకు ఎదురయ్యాయని బయటపెట్టింది తెలుగమ్మాయి అర్చన. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అర్చన…తనకు ఎదురైన అనుభవాలను వివరించింది. టాలీవుడ్‌లో ఇమడలేక ప్రస్తుతం ముంబైకి షిఫ్టైన ఈ భామ…తెలుగు చిత్ర పరిశ్రమకు బాలీవుడ్‌కి చాలా తేడా ఉందన్నారు.

 Actress Archana  Revealed Shocking Facts

తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు పెద్దగా ప్రోత్సాహం లభించదని తెలిపింది. తనతో చాలామంది ఇదే విషయాన్ని చెప్పారని…టాలెంట్ ఉన్న తనకు అవకాశాలు రాలేదని చెప్పింది. ఇక షాకింగ్‌కు గురిచేసే అంశం ఏంటంటే…సినిమాలో అవకాశం ఇప్పించిన ఓ అగ్రహీరో….. ఆ తర్వాత తన ఆఫీసుకు పిలిచి… నీకు ఛాన్స్ ఇప్పించాను.. కృతజ్ఞతగా మరి నాకేమిస్తావ్ అని అడిగాడని తెలిపింది. ఈ మాట వినగానే తొలుత షాక్‌కు గురైన ఈ భామ…మీలాంటి గొప్ప నటుడుకు నేను ఏమివ్వగలను సార్ .. అంటూ తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకుందంట.

సినిమా ఇండస్ట్ర్రీలో కొనసాగాలంటే ఇలాంటి ఎన్నో అవమానాలు భరించక తప్పదని అర్చన అంటోంది. ఇలాంటి పనులు చేసేందుకు అంగీకరిస్తే సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని లేకుంటే కష్టాలు పడాల్సి వస్తుంది చెప్పుకొచ్చింది. అయితే, ఆ హీరో ఎవరో పేరు చెప్పడానికి నిరాకరించింది.

 Actress Archana  Revealed Shocking Facts

దర్శకధీరుడు రాజమౌళికి క్షమాపణ చెబుతున్నానని తెలిపింది. ఫస్ట్ సినిమా ‘నేను’లో హీరోయిన్‌ పాత్ర చేసిన తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దాంటానా’లో బలవంతంగా సపోర్టింగ్‌ రోల్‌ చేయవలసి వచ్చింది. కళ్లజోడు పెట్టి డీ-గ్లామర్‌గా చూపించడంతో ఆ సినిమా సెట్లో రోజూ ఏడ్చేదాన్నని తెలిపింది. అయితే, క్యారెక్టర్‌కు పెద్ద పేరు వచ్చిన….ఆ సినిమాలో చేయడం వల్ల రాజమౌళి సినిమాలో హీరోయిన్‌ పాత్రను పొగొట్టుకున్నానని తెలిపింది.

ఆ భయంతోనే రాజమౌళి ‘మగధీర’లో ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించానని…. ఆ సినిమాలో సలోని పాత్రకు మొదట నన్నే అడిగారు. కానీ, సపోర్టింగ్‌ రోల్స్‌ అంటే భయమేసి దానిని రిజెక్ట్‌ చేశా. అది నేను చేసిన పెద్ద మిస్టేక్‌. ఆ విషయంలో ఆయనకు ఫోన్‌ చేసి క్షమాపణ చెబుదామనుకున్నా. ఆ రోల్‌ చేసి ఉంటే ‘మర్యాదరామన్న’లో హీరోయిన్‌ క్యారెక్టర్‌ వచ్చి ఉండేదేమో. ఇక, ‘ఖలేజా’లో కూడా అలాంటి క్యారెక్టరే చేయాల్సి వచ్చింది. అలాగే ‘పౌర్ణమి’ సినిమాలో చిన్న డ్యాన్స్‌ బిట్‌ చేశానని తెలిపింది.