కూతురు స్కూల్‌కి కేటీఆర్…

120
ktr @his daughter alekhya school

సీఎం కేసీఆర్ కుమారుడిగానే కాకుండా తెలంగాణ కేబినెట్ లో కీల‌క మంత్రిగా ఉన్న కేటీఆర్ ఏం చేసినా వార్తే. క్రాపు మార్చి దువ్వినా, బుర‌ద‌లో దిగి రోడ్ల ప‌రిస్థితిని ప‌రిశీలించినా, 10కే ర‌న్ లాంటి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నా… కేటీఆర్ ఏది చేసినా సంచలనమే. ఇక సోషల్ మీడియాలో ఎప్పుటికప్పుడు వార్తలపై స్పందించే కేటీఆర్..రాష్ట్రాన్ని ఐటీ రంగంలో ముందుకు తీసుకుపోవటంతో ఎంతో బిజీగా ఉన్నారు.

ktr @his daughter alekhya school

ఓ వైపు పాలిటిక్స్‌లో బిజీగా ఉంటూనే…సమయం దొరికినప్పుడల్లా కుటుంబానికి సమయం కేటాయిస్తున్నారు కేటీఆర్. ఇటీవలె కుటుంబంతో కలిసి సూర్య 24 సినిమా చూసిన కేటీఆర్…తన పిల్లలు అదే వాచ్ కావాలని కోరుతున్నారని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక కూతురు అలేఖ్య అంటే రామన్నకి ఎంతో ప్రేమ. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే..తన కూతురు చదువుతున్న పేరెంట్ టీచర్‌ మీటింగ్‌కు హాజరయ్యారు కేటీఆర్.

ktr @his daughter alekhya school

ఓ సాధారణ సాధారణ వ్యక్తిగా టీచర్లతో సంభాషించారు. కూతురి ప్రొగ్రెస్ రిపోర్టును మంత్రి తిరగేశారు. అలేఖ్య ప్రొగ్రెస్ రిపోర్టును చూసి మురిసిపోయారు. తాను ఊహించిన దాని కంటే తన కూతురు మెరుగ్గా చదువుతోందన్నారు. అలేఖ్య స్టడీస్ గురించి టీచర్లను అడిగి తెలుసుకున్నారు.

తన కూతురిపై ఉన్న ఆప్యాయతను కేటీఆర్ ట్వీటర్ ద్వారా పంచుకున్నారు. పేరెంట్ టీచర్ మీటింగ్‌కు వెళ్లేందుకు చాలా ఉత్సుకత చూపినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.

                                        ktr @his daughter alekhya school