సుప్రీంకోర్టుకు శివసేన

486
shiv sena
- Advertisement -

ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఇచ్చిన సమయాన్ని పొడిగించవద్దని మహారాష్ట్ర గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది శివ సేన. తొలుత బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించగా అధికారం చేపట్టేందుకు కావాల్సిన మెజార్టీ లేకపోవడంతో ఆ పార్టీకి ముందుకురాలేదు. దీంతో శివసేనను ఆహ్వానించారు గవర్నర్. అయితే శివసేన కూడా ముందుకురాకపోవడంతో ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు గవర్నర్.

రాత్రి 8.30 గంటల వరకు ప్రభుత్వ ఏర్పాటుకు సమయం ఇవ్వగా గవర్నర్ తీరుపై శివసేన మండిపడింది. మరోవైపు ఎన్సీపీ చీఫ్ వరద్ పవార్‌తో సమావేశమయ్యేందుకు ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరారు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, కేసి వేణుగోపాల్, అహ్మద్ పటేల్. మరోవైపు శరద్ పవార్ తో ఫోన్ లో మాట్లాడారు సోనియా గాంధీ. దీంతో మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి నేటితో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -