ముస్లిం రిజర్వేషన్లకు జై కొట్టిన శివసేన..

259
shiv sena muslim reservations
- Advertisement -

అవును మీరు చదివింది నిజమే. ముస్లిం రిజర్వేషన్లకు జై కొట్టింది కరుడు గట్టిన హిందూపార్టీగా ముద్రపడిన శివసేన. విద్యారంగంలో ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరింది. ముస్లింలు రిజర్వేషన్లు కోరడం సమంజసమేనని…అన్ని వర్గాల డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలని శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

ముంబై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని తప్పుబట్టిన థాకరే… మరాఠా రిజర్వేషన్లతో పాటు ధన్ గర్స్, ముస్లిం, ఇతర రిజర్వేషన్ల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

ముస్లిం రిజర్వేషన్లకు శివసేన మద్దతివ్వడాన్ని స్వాగతించింది ఎంఐఎం. ఆ పార్టీ ఎమ్మెల్యే ఇంతియాజ్ జలీల్ మాట్లాడుతు శివసేన తీసుకున్న నిర్ణయం శుభపరిణామం అని ఇప్పటికైనా బీజేపీ నేతలు కళ్లు తెరవాలన్నారు. ముస్లింలను టార్గెట్ చేయడం మానాలని సూచించారు. కోర్టు ఆదేశాలను మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు. రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎంతోమంది ముస్లిం పౌరులకు చదువుకునే అవకాశం దొరుకుతుందన్నారు.

- Advertisement -