ద‌స‌రాకి ఎన్టీఆర్ రావ‌డం ఖాయం..

201
NTR And Trivikram
- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్-మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో రూపొందుతున్న చిత్రం అర‌వింద స‌మేత వీర రాఘ‌వ. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే షూటింగ్ ఆల‌స్యంగా మొద‌లు పెట్ట‌డంతో ద‌స‌రాకు ఎన్టీఆర్ రాడ‌ని, సంక్రాంతికి వ‌స్తున్నాడ‌ని టాక్ వినిపించింది. అనుకున్న‌ట్లుగానే ఈ సినిమాని ద‌స‌రాకి విడుద‌ల చేస్తున్న‌ట్లు తాజా స‌మాచారం.

NTR

ఇప్పటికే త్రివిక్ర‌మ్ 75 శాతం షూటింగ్ పూర్తి చేశాడ‌ని, సెప్టెంబ‌ర్ 15వ తేదీ నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడ‌ని అంటున్నారు. క‌చ్చితంగా ద‌స‌రా బ‌రిలో అర‌వింద స‌మేతతో ఎన్టీఆర్ బాక్సాఫీస్ వ‌ద్ద ర‌చ్చ చేయ‌నున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. ప్రధాన పాత్ర‌లకు సంబంధించిన చిత్ర‌క‌ర‌ణ‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడ‌ట త్రివిక్ర‌మ్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టిస్తోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కి తండ్రిగా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవెలె ఈ సినిమా నుంచి లీకైన ఫోటోను బ‌ట్టి నాగ‌బాబు ఎన్టీఆర్ తండ్రి పాత్రలో నటిస్తున్న‌ట్లు అభిమానులు భావిస్తున్నారు. రాయ‌ల సీమ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కుతున్న‌ట్లు స‌మాచారం.

- Advertisement -