మహారాష్ట్రలో కుదిరిన పొత్తు..సీఎం శివసేనకే

458
Shiv-Sena-Alliance-With-NCP
- Advertisement -

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. ప్రస్తుతం అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. కాగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని చెప్పారు.

ఈ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల మధ్య చర్చలు ఫలప్రదమయ్యాయి. మూడు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. శివసేనకు పూర్థి స్థాయిలో సీఎం పదవి… ఎన్సీపీ, కాంగ్రెస్ లకు చెరో 14 మంత్రి పదవులతో పాటు చెరో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు సమాచారం.

అయితే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అఖిల భారత హిందూ మహాసభ నేత ప్రమోద్ జోషి వేశారు. శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కలయికతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించకుండా ఆదేశించాలని ఆయన సుప్రీంకోర్టును తన పిటిషన్‌లో కోరారు. ఎన్నికల తరువాత పార్టీల పొత్తు ప్రజలను మోసం చేయడంగా పరిగణించాలని జోషి కోర్టును కోరారు. కాగా ఎన్నికలకు ముందు బీజేపీ, శివసేన పార్టీలు కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -