పేదల ఆత్మ గౌరవం కోసమే డబుల్ బెడ్ ఇండ్లు

316
Harish

పేదల ఆత్మ గౌరవం కోసమే డబుల్ బెడ్ ఇండ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా ఆందోల్ నియోజకవర్గం పుల్కాల్ మండలం సింగూర్ గ్రామంల కొత్తగా నిర్మించిన 150 డబుల్ బెడ్ రూం ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జడ్పీ చైర్ పర్సన్ మంజు శ్రీ రెడ్డి పలువురు అధికారులు పాల్గోన్నారు.

ఈసందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సింగూర్ గ్రామంలో 150 కొత్త డబుల్ బెడ్ రూమ్ గృహ ప్రవేశం చేయడం సంతోషం అన్నారు. నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా ఇల్లు నిర్మాణం చేసి ఇస్తున్నాము. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్ల నిర్మాణం చేసి ఇస్తుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం లో ఇండ్ల కోసం పేదలు చెప్పులు అరిగేలా తిరిగి అప్పుల పాలయ్యారు.సింగూర్ ప్రాజెక్ట్ పై 300 కోట్లు ఖర్చుచేసి సాగునీరు ఇచ్చాము.ఈ సారి వర్షాలు లేక…సింగూర్ ప్రాజెక్ట్ నిండక సాగునీరు ఇవ్వలేకపోయము. కాళేశ్వరం అనుసంధానం ద్వార ఆందోల్, నారాయణ ఖేడ్, జహీరాబాద్ కు నియోజకవర్గ లకు సాగునీరు ఇస్తామని చెప్పారు.