Harishrao:సిద్దిపేటలో శిశు గృహ

37
- Advertisement -

సిద్దిపేట జిల్లా కేంద్రంలో 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన శిశుగృహను ప్రారంభించారు మంత్రి హరీష్‌ రావు. ఈ సందర్భంగా శిశుగృహలో మానవీయ కోణం ఆవిష్కృతమైంది. శిశు గృహలో అనాధ శిశువులను మంత్రి తన్నీరు హరీష్ రావు పరిశీలిస్తున్న క్రమంలో 3 నెలల వయస్సున్న చిన్నారి చిరునవ్వులు చిందిస్తూ అమాయకంగా శిశుగృహ ఆయాల చేతిలో ఆడుకుంటూ కనబడటంతో ఆ పాపను ఎత్తుకొన్నారు హరీష్‌.

ముద్దులోలుకుతున్న ఆ చిన్నారికి శ్రీజ అని పేరు పెట్టి శ్రీజ ముఖంలో ఎప్పటికి చిరునవ్వులు తొలగని విదంగా తల్లిదండ్రులు లేని లోటు కనబడకుండా ఆనందంగా పెరిగి నిండునూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించేలా శిశు గృహ అధికారులు ఉన్నంతంగా తీర్చిదిద్దాలని ఆశీర్వదించారు. తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకు నోచుకోని ఇలాంటి అనాధ పిల్లల సేవచేయడం ప్రజా ప్రతినిధులుగా మాకు చాలా సంతృప్తిని ఇస్తుందని అనాధ శిశువులందరినీ శిశు గృహ అధికారులు సొంత బిడ్డల లాగా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వేలేటి రోజ, తదితరులు పాల్గొన్నారు.

Also Read:సలార్ పై ఫ్యాన్స్ లో భయం పోవట్లే?

- Advertisement -