ఆసనాల్లో రాజు ‘శీర్షాసనం’!

47
- Advertisement -

మారుతున్న మన ఆహారపు అలవాట్ల కారణంగా ఆయా అనారోగ్య సమస్యలు తలెత్తడం సహజం. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలకు యోగా లేదా వ్యాయామం ద్వారా చక్కటి పరిష్కారం లభిస్తుంది. యోగా లేదా వ్యాయామం చేయడానికి వయసు పరిమితి లేదు.. ఏ వయసు వారైనా చేయవచ్చు. అలాగే ఎన్నో ఆరోగ్య సమస్యలను దరి చేరకుండా కాపాడుకోవచ్చు. అయితే మానసిక ప్రశాంతతను కలిగించుటల్లో వ్యాయామం కంటే కూడా యోగా ఎంతో మేలని యోగా నిపుణులు చెబుతున్నారు. ఇక యోగాలో ఎన్నో ఆసనాలు ఉన్నప్పటికి వాటన్నిటి కంటే ఆసనల్లో రాజు గా చెప్పుకునే ‘ శీర్షాసనం ‘ గురించి తెలుసుకుందాం !

శీర్షాసనం వేయు విధానం

మొదట నేలపై మెత్తటి టవల్ గాని దుప్పటి గాని పరచుకొని, రెండు చేతులపై తల భాగాన్ని నేలకు ఆనించాలి. ఆ తరువాత మెల్లగా రెండు కాళ్ళను పైకి ఎత్తి, పిక్కలు, తొడలు, వెన్నెముక నిటారుగా ఉండేలా చూచుకోవాలి. అయితే బరువు తల మీద తక్కువగా ఉంచుతు చేతులపై అధిక బరువు మోపి, శ్వాస సాధారణ స్థితిలో తీసుకోవాలి. ఇలా వీలైనంతా సేపు ఉంటూ తిరిగి మెల్లగా కళ్ళు దించి విశ్రాంతి కొరకు పద్మాసనం లేదా శవాసనం వేయాలి. మొదటిసారి ఈ ఆసనం వేయు వాళ్ళు గోడ లేదా ఇతరుల సహాయం తీసుకోవాలి.

ఉపయోగాలు
ఈ శర్షాసనం వేయడం వల్ల తలలోని పియూష గ్రంధి అలాగే, పీనియల్ గ్రంధి ఉత్తేజ పరచబడి రోగ నిరోదక శక్తి పెరగడంలో దోహద పడుతుంది. అంతే కాకుండా తలలోని జ్ఞానేంద్రియాలన్నిటికి రక్తప్రసరణ తగిన మోతాదులో లభించడం వల్ల అవన్నీ కూడా సక్రమంగా పని చేస్తాయి. అలాగే ఊపిరి తిత్తుల పనితీరును మెరుగు పరచడం, గుండెకు రక్త ప్రసరణను మెరుగు పరచడంలో కూడా ఈ శర్షాసనం ఎంతగానో ఉపయోగ పడుతుంది.

గమనిక
తల గాయాలు ఉన్నవాళ్ళు, అలాగే చెవి కన్ను సమస్యలు ఉన్నవాళ్ళు, అలాగే అధిక రక్తపోటు, మెడనొప్పి, ఉన్న వాళ్ళు ఈ ఆసనం వేయకూడదు.

Also Read:TTD:సీతారాముల కల్యాణానికి కోటి తలంబ్రాలు

- Advertisement -