బ్రేకింగ్‌:రాజ్‌కుంద్రాతో శిల్ప బ్రేకప్‌..!

255
shilpa
- Advertisement -

టాలీవుడ్‌,బాలీవుడ్‌ ఇండస్ట్రీ ఏదైనా ఇట్టే కలిసిపోవడం, బ్రేకప్‌ చెప్పడం కామన్‌. ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రెటీలు ప్రేమ పెళ్లిచేసుకుని విడాకులు చెప్పిన సందర్భాలున్నాయి. ఇక సెలబ్రెటీల జంటల మధ్య ఏ చిన్న గ్యాప్‌ వచ్చినా అది వార్తై చివరకు గాసిప్స్‌ రూపంలో చక్కర్లు కొట్టడం కామన్‌. తాజాగా ఈ జాబితాలో శిల్పా శెట్టి, రాజ్‌ కుంద్రా దంపతులు చేరారు.

శిల్ప, అనురాగ్‌ బసు, గీతా కపూర్‌లు ‘సూపర్‌ డ్యాన్సర్‌ 3’ అనే డ్యాన్స్‌ రియాల్టీ షోకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనురాగ్‌ శిల్పకు తెలియకుండా ఆమె ఫోన్‌ తీసుకుని ‘నేను, రాజ్‌కుంద్రా విడాకులు తీసుకోవాలనుకుంటున్నాం’ అని ఆమె తల్లి సునంద శెట్టికి మెసేజ్ పంపారు.

ఇంకేముంది విషయం కుటుంబసభ్యుల ద్వారా మీడియాకి లీకవడంతో అంతా కంగారుపడిపోయారు. ఈ నేపథ్‌యంలో విషయం కాస్త పెద్దది అవుతుండటంతో స్వయంగా శిల్పానే రంగంలోకి దిగారు. విడాకులు తీసుకొనున్న వార్తల్లో నిజం లేదని ఇదంతా అనురాగ్‌ బసు చేసిన నిర్వాకం అని శిల్ప తెలిపింది. జస్ట్ జోక్‌గా అనురాగ్ మెసేజ్ పంపారని శిల్పా క్లారిటీ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

శిల్ప, రాజ్‌కుంద్రా 2009లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2012లో వియాన్‌ జన్మించాడు. గత నెల 21న కుమారుడి నాల్గవ పుట్టి నరోజును ఘనంగా నిర్వహించారు. వ్యాపారవేత్త అయిన రాజ్‌ కుంద్రాతో కలిసి ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ టీంను కొనుగోలు చేసింది శిల్పా. ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో రెండు సంవత్సరాల పాటు రాజస్థాన్‌పై వేట పడిన సంగతి తెలిసిందే.

- Advertisement -