‘ఆర్ఆర్ఆర్’కు మీరే టైటిల్ చెప్పండీ..!

226
RRR Title

బాహుబలి సినిమాతో భారీ విజయం తరువాత మళ్ళీ రాజమౌళి చిత్రీకరిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా పూర్తయ్యి రిలీజ్ చేస్తారా అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మల్టీస్టారర్‌లో కొమరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్‌లు కనిపించనున్నారు. వీరికి జోడీగా ఆలియా భట్, డైజీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్లుగా నటించనున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

అయితే ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్‌తో తెరక్కెకుతున్న ఈ సినిమాకు మంచి టైటిల్ చెబితే, దాన్నే పెట్టేందుకు ఆలోచిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన కథ అందరికీ తెలుసునని, దాన్ని ఆధారంగా ‘ఆర్ఆర్ఆర్’ అంటే అబ్రివేషన్ చెప్పాలని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ కోరింది. అభిమానులు తమ సొంత అబ్రివేషన్స్ తో రావాలని, వాటిని రాజమౌళి స్వయంగా పరిశీలిస్తారని వెల్లడించింది. అభిమానులు తమ టైటిల్స్ ను ట్వీట్ చేయాలని సూచించింది. మరి ఆలస్యం ఎందుకు మీరూ ఓ టైటిల్‌ను ట్వీట్‌ చేయండీ.