సొంతగడ్డపై కోల్ కతాకు షాకిచ్చింది ఢిల్లీ కెపిటల్స్. ధావన్ మెరుపులకు తోడు రిషబ్ పంత్ రాణించడంతో ఢిల్లీ ఘనవిజయం సాధించింది. భారీ లక్ష్యమైన ధావన్ ధనా ధన్ ముందు చిన్నబోయింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను వాళ్ల సొంతగడ్డపైనే ఓడించి వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
179 పరుగల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ 18.5 ఓవర్లలోనే 3 వికెట్లు కొల్పోయి లక్ష్యాన్ని చేధించింది. శిఖర్ ధావన్ (97 నాటౌట్) ,రిషబ్ పంత్ (46) మెరుపుల ముందు లక్ష్యం చిన్నబోయింది.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు మంచి ఆరంభం లభించలేదు. ఇన్నింగ్స్ తొలి బంతికే డెన్లీ (0)ని ఇషాంత్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ స్థితిలో శుభ్‌మన్, ఉతప్ప (28)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. నితీష్ రాణా (11) ,కార్తీక్ (2) వెనుదిరిగినా శుభమన్ గిల్ ఒంటరిపోరాటం చేశాడు. శుభ్‌మన్ గిల్ (65) పరుగులతో రాణించగా చివరలో రసెల్ విధ్వంసం సృష్టించాడు. 21 బంతుల్లోనే రసెల్ 45 చేసి కోల్ కతా భారీ స్కోరు సాధించడంలో కీ రోల్ పోషించాడు. ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించిన ధావన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.