మాజీ సీఎం శిబుసోరెన్‌కు కరోనా

231
shibu soren

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30 లక్షలకు చేరువయ్యాయి. రోజుకు 70 వేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు,మాజీ సీఎంలు కరోనా బారీన పడగా తాజాగా జార్ఖండ్ మాజీ సీఎం,రాజ్యసభ సభ్యులు శిబుసోరెన్ కరోనా బారీన పడ్డారు.

అనారోగ్యంతో కరోనా పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్‌గా తేలింది. సోరెన్‌తో పాటు ఆయన భార్య రూపి సోరెన్‌కు పాజిటివ్ రాగా వారు హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు.

శిబు సోరెన్ కుమారుడు, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు సోమ‌వారం మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు హేమంత్ సోరెన్‌.