ప్రజలకు గవర్నర్ ,సీఎం వినాయకచవితి శుభాకాంక్షలు..

167
cm kcr

రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అతి త్వరలో కరోనా మహమ్మారి నుంచి విముక్తి లభించి రాష్ట్ర, దేశ ప్రజలందరు సాధారణ జీవన పరిస్థితులకు రావాలని… ప్రజలందరు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

వినాయకచవితి పర్వదినాన్ని కుటుంబసభ్యులతో ఇంట్లోనే ఆనందంగా జరుపుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మట్టితో తయారుచేసిన సహజసిద్ధమైన గణేశ్‌ విగ్రహాలను భక్తి ప్రపత్తులతో పూజించాలని కోరారు. కరోనా వ్యాప్తి కారణంగా అందరూ ఇండ్లలోనే వినాయకచవితి జరుపుకోవాలని పిలుపునిచ్చారు.