పాకిస్థాన్‌ను మరోసారి చావుదెబ్బ కొట్టింది భారత్. 3 ఫైటర్ జెట్లసహా అన్నింటినీ చిత్తుచేసింది భారత్. విమానాశ్రయం, సైనిక కేంద్రాలే లక్ష్యంగా ప్రయోగించిన డ్రోన్లు, ఆరు యుద్ధవిమానాలను భారత సైన్యం నేలమట్టం చేసింది. పాక్ ప్రయోగించిన 8 క్షిపణులను నేలకూల్చింది. పాక్ పైలెట్‌ను పట్టుకుంది. భారత్‌వైపు ఎలాంటి నష్టం జరగలేదని రక్షణశాఖ ప్రకటించింది.
జమ్ము విమానాశ్రయంతోపాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. దాదాపు 35నిమిషాల పాటు పాక్ చేసిన దాడులను భారత్ బలగాలు అత్యంత సమర్థంగా తిప్పికొట్టింది.
అలాగే పాకిస్థాన్‌కు చెందిన ఒక ఎఫ్-16, రెండు జేఎఫ్-17 సహా 6 యుద్ధ విమానాలను భారత సైన్యం కూల్చేసింది. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను భారత్ అడ్డుకుని కూల్చివేయడం వల్లే పేలుళ్లు వినబడి ఉండొచ్చని సమాచారం. పాక్ దాడులకు భారత్ అంతే తీవ్రంగా స్పందించింది. పాక్‌లోని మరో రెండు వైమానిక రక్షణ వ్యవస్థలను కూల్చివేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Also Read:మంచు మనోజ్…దూకుడు!

