నల్గొండ జిల్లాలో మొదటి విడతలో పెండింగ్‌లో ఉన్న గొర్రెల యూనీట్ల పంపిణి కార్యక్రమాన్ని శనివారం మంత్రులు జగదీష్ రెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్,మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్,జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, పశు పాడి అభివృద్ధి శాఖ డైరెక్టర్ అనిత రాజేంద్ర, కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, ఎమ్మెల్యే లు భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, భాస్కర్ రావు,చిరుమర్తి లింగయ్య, రవీంద్ర కుమార్, మల్లయ్య యాదవ్ తదితరులు అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాతూ.. చరిత్రలో ఏ నాయకుడు చేయని ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారు. గొర్రెల పంపిణీ పథకం గొర్ల కాపరుల జీవితాల్లో వెలుగులు నింపింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేసింది. గతంలో తెలంగాణలో మాసం దిగుమతులు వచ్చేవి. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ చేరుకుందని మంత్రి తెలిపారు.
గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలు చాలా సంతోషంగా జీవిస్తున్నారు. కరోనా కారణంగా గొర్రెల పంపిణీ నిలిచిపోయింది. కరోనా పరిస్థితిలు చక్కబడగానే వెంటనే పెండింగ్‌లో ఉన్న యూనిట్‌లను పంపిణీ చేస్తున్నాం.వచ్చే బడ్జెట్‌లో రెండో విడత గొర్రెల పంపిణీకి నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ రోజు గొల్ల కుర్మలు చాలా సంతోషంగా ఉన్నారు. కులవృత్తి చేసుకుంటూ ఆత్మభిమానంతో జీవిస్తున్నారు. సీఎం కేసీఆర్ చెప్పితే అది చట్టం చేసినట్టే.. ఒక యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఇస్తున్నాం.. అర్హులు అందరికి అందిస్తున్నాం. సమైక్య ప్రభుత్వంలో కులవృత్తులు సర్వనాశనం అయి మూలకుపడ్డాయి. రైతు బంధు, రైతు భీమా పథకాలు రైతులకు వరంలా మారాయని మంత్రి అన్నారు.
సంచార పశువైద్య శాలలు ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. గొర్రెలకు ఇన్సూరెన్స్ కూడా అందిస్తున్నాం. ప్రతిపక్ష పార్టీల కుళ్లు రాజకీయాల్లో పడి కుల సంఘాలు ఆగం ఆగం కావొద్దు అని వేడుకుంటున్న.. కేసీఆర్ నాయకత్వం అన్ని వర్గాలు, అన్ని కులవృత్తలు పూర్వ వైభవం సంతరించుకున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరి పార్టీ… ప్రతి ఒక్కరి ఇంట్లో టీఆర్ఎస్ జెండా ఉంటుందని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు.
మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయి.ఇది తెలంగాణ ప్రజల అదృష్టం. ప్రతిపక్షాలు అడ్డగోలుగా, మర్యాద లేకుండా మాట్లాడుతూ ప్రజల్లో చులకన అవుతున్నాయి. సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయి. ఉమ్మడి నల్గొండలో సాగు నీటి ప్రాజెక్టులు అన్ని పూర్తి అవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం చల్లగా ఉంటే ప్రజలంతా సంతోషంగా వుంటారు.ఈ ప్రభుత్వానికి ఏ చిన్న ఇబ్బంది ఎదురైన నష్టపోయేది ప్రజలే.. ఇప్పుడు గ్రామీణ కులవృత్తులు అన్ని చాలా బాగా అభివృద్ధి అవుతున్నాయన్నారు.
ఈ సమావేశంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాం చంద్ర నాయక్, జెడ్పీ వైస్ చైర్మన్ పెద్దులు,ఆర్‌ఓ శరణ్య రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, వైస్ ఛైర్మన్ అబ్బాగోని రమేష్ టీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పిల్లిరామరాజు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పంకజ్ యాదవ్, టీఆర్‌ఎస్ నాయకులు మల్లేష్ గౌడ్, కటికం సత్తయ్య గౌడ్, జెడ్పీటీసీ తిప్పన, గొర్ల కాపారుల సంఘం అధ్యక్షుడు నర్సయ్య యాదవ్,యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్, జడ్పీటీసీ లు,ఎంపీపీలు, సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.