మీ వీధుల్లోగానీ, రోడ్లపైన, ఆఫీసుల్లో, సినిమా హాల్ లో ఎక్కడైనా.. సరే ఆకతాయిలు మిమ్మల్ని వేధిస్తున్నారా..? ప్రేమ, దోమ అంటూ వెంటపడుతున్నారా..? అయితే ఒక్క మిస్ కాల్ ఇవ్వండి వారి తాట తీస్తామంటున్నారు షీ టీమ్స్ బృందం.
పోకిరీలు వేధిస్తున్నా.. మీరు మౌనంగా ఉంటే వారికి అదే ఆయుధంగా మారుతుందని అలాంటి ఘటనలు ఎదురైనప్పుడు షీ టీంను సంప్రదిస్తే.. ఆకతాయిలకు తగిన బుద్ది చెబుతామని హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. బాధితులు పోలీస్ స్టేషన్ కి రావాల్సిన అవరసరం లేదని ఈ క్రింది నంబర్లు మిస్ కాల్ కానీ, మెసేజ్, సోషల్ మీడియా ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.
కమిషనరేట్ — 9490617444
బాలానగర్ — 9490617349
మాదాపూర్ ….. 8332981120
మియాపూర్ ….. 9491051421
శంషాబాద్ …… 9490617354
పేట్‌బిషీరాబాద్ ….. 7901099439
ఐటీ కారిడార్ … 9490617352
గచ్చిబౌలి ….. 9490617352
రాజేంద్రనగర్ …… 7901099438
ఫేస్‌బుక్ ఐడీ: sheteam.cyberabad
ఈ – మెయిల్ ఐడీ sheteam.cyberabad@gmail.com,