మొక్కలు నాటిన ఎంపీ శశి థరూర్….

226
congrwss
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ దేశవ్యాప్తంగా ఉద్యమంలా కొనసాగుతుంది .చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి గారు విసిరినా గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి ఢిల్లీ లోని తన అధికార నివాసంలో మొక్కలు నాటిన తిరువంతపురం ఎంపీ శశి థరూర్ .

ఈ సందర్బంగా శశి థరూర్ గారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషం , ఇది పర్యావరణ పరిరక్షణకు ఒక నిజమైన ఛాలెంజ్ ఎందుకంటే ఆక్సిజన్ కేంద్రాలు నెలకొల్పే పరిస్థితి మనకు వచ్చింది అంటే మనం మొక్కలు నాటడం అశ్రద్ధ వహించాం . మొక్కలు నాటడం , పెంచడం బాధ్యతగా తీసుకోవాలన్నారు.

ఇకనైనా దీన్ని ప్రతి ఒక్కరు బాధ్యయుత ఛాలెంజ్ తీసుకొని ఇండియా ని గ్రీన్ ఇండియా గా మార్చాలి . ఈ అవకాశం కల్పించిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గారికి ధన్యవాదాలు . ఈ ఛాలెంజ్ ని నేను కర్ణాటక రాజ్యసభ సభ్యులు జయరామ్ రమేష్ , బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా ,బీజేపీ దేశ ఉపాదాక్ష్యులు & స్పోక్స్ పర్సన్ బైజయంత్ జయ్ పాండా , అమృత్సర్ ఎంపీ గుర్జిత్ సింగ్ ఔజ్ల , వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా గార్లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా కోరారు .

- Advertisement -