దిగ్గజాలను కదిలిస్తున్న “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”

221
shashi tharoor
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” దేశవ్యాప్తంగా జోరుగా నడుస్తుంది. “మూడు మొక్కలు నాటండి–మరో ముగ్గురితో మూడు-మూడు మొక్కలు నాటించడండి” అనే సామాజిక నినాదం పల్లె నుంచి దేశాన్ని నడిపించే ప్రజానేతల వరకు చేరుకుంది.

ఈ క్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి విసిరిన ఛాలెంజన్ స్వీకరించిన.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహిత, అంతర్జాతీయ రాజనీతజ్ఞుడు శశిథరూర్ ఈ రోజు తన నియోజకవర్గం కేరళలోని తిరువనంతపురంలో మూడు మొక్కలు నాటారు.

అనంతరం శశిథరూర్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడాన్ని నేను ఎల్లప్పుడు ఎంజాయ్ చేస్తాను. నన్ను గుర్తుంచుకొని “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగం చేసిన ఎంపీ రంజిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో నా నియోజకవర్గమంతా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగిస్తా. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఎక్కడా విశ్రమించకుండా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను ముందుకు తీసుకువెళ్తున్న నిర్వాహకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -