బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపిన డ్రీమ్ 11..!

347
dream 11

ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్‌ షిప్ నుండి వివో తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో పలు సంస్ధలు టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం పోటీపడిన డ్రీమ్ 11 దక్కించుకుంది.

వివో గతంలో వెచ్చించిన దాంట్లో సగం రేటుకే రైట్స్‌ని దక్కించుకుంది డ్రీమ్ 11. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ. ఐపీఎల్ కు చెందిన 6 ఫ్రాంచైజీలతో సహా మొత్తం 19 స్పోర్ట్ లీగ్ లతో కలసి డ్రీమ్11 పనిచేస్తోంది.

డ్రీమ్11 సీఈవో, సహవ్యవస్థాపకుడు హర్ష్ జైన్ మాట్లాడుతూ, 2008లో ఐపీఎల్ లాంచ్ అయినప్పుడే డ్రీమ్11 అనే ఆలోచన పుట్టిందని చెప్పారు. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించే అవకాశాన్ని కల్పించిన బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపారు. ఐపీఎల్ స్పాన్సర్ గా డ్రీమ్11ను స్వాగతిస్తున్నామని బ్రిజేశ్ పటేల్ తెలిపారు.