అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంపై కేంద్ర ప్రభుత్వం మౌనం పాటిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ భిన్నంగా స్పందించారు. బీజేపీ ప్రభుత్వ వైఖరిని సమర్థిస్తూ, దాన్ని “బాధ్యతాయుతమైన రాష్ట్ర విధానం” గా అభివర్ణించారు.
ఈ సమయంలో నిగ్రహంతో వ్యవహరించడం అవసరం. నిగ్రహం అనేది లొంగుబాటు కాదు; అది మన బలాన్ని చూపిస్తుంది. మన ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఇది కీలకం అని వ్యాఖ్యానించారు శశిథరూర్.
ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. తన వ్యాసంలో ఆమె, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యపై కేంద్రం మౌనం పాటించడం సరైనది కాదని అన్నారు.
ఇది తటస్థత కాదు, బాధ్యత నుంచి తప్పించుకోవడం అని ఆమె వ్యాఖ్యానించారు. భారత్-ఇరాన్ సంబంధాలు చారిత్రకంగా, వ్యూహాత్మకంగా కీలకమని, గతంలో ఇరాన్ భారత్‌కు సహాయం చేసిన సందర్భాలను కూడా గుర్తు చేశారు.
ఈ వ్యాఖ్యలపై థరూర్ మాట్లాడుతూ…ఖండన (condemnation) మరియు సంతాపం (condolence) మధ్య తేడా ఉంది. సంతాపం అనేది అనుభూతిని వ్యక్తం చేయడమే అన్నారు.
Also Read:మెగాస్టార్ చిరు..ఉచిత విద్యా ప్రాజెక్ట్

