పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక దౌత్య చర్యలు చేపట్టారు. ఖతార్, ఫ్రాన్స్, జోర్డాన్,ఓమన్,మలేషియా దేశాల నాయకులతో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసిన మోదీ, శాంతి స్థాపనకు సంభాషణ (డైలాగ్) మరియు దౌత్యం అవసరమని స్పష్టం చేశారు. పశ్చిమ ఆసియాలోని శక్తి మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడులు పరిస్థితిని మరింత విషమం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
జోర్డాన్ రాజు అబ్దుల్లాతో మాట్లాడిన మోదీ, పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి, భద్రత పునరుద్ధరణకు సంభాషణ అవసరమని చెప్పారు. జోర్డాన్ భారత్ పౌరులను సురక్షితంగా తిరిగి పంపడంలో చేసిన సహాయాన్ని ప్రశంసించారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడి మాక్రన్తో కూడా మోదీ చర్చలు జరిపారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి సంభాషణ, దౌత్య మార్గాలే సరైన మార్గమని ఇద్దరూ అభిప్రాయపడ్డారు.
ఒమాన్ భౌగోళిక సమగ్రత ఉల్లంఘనను భారత్ ఖండించింది. అలాగే అక్కడ చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించడంలో ఒమాన్ పాత్రను అభినందించింది.
మలేషియా ప్రధాని ఇబ్రహీంతో మాట్లాడిన మోదీ, హరి రాయా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ ఆసియా పరిస్థితిపై చర్చించి, శాంతి కోసం సంభాషణ అవసరమని ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.
Also Read:మెగాస్టార్ చిరు..ఉచిత విద్యా ప్రాజెక్ట్

