పార్టీతో అభిప్రాయ బేధాలు:శశిథరూర్

9
- Advertisement -

పార్టీతో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి అని తెలిపారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. నిలంబూర్ ఉప ఎన్నిక ప్రచారానికి గైర్హాజరు ఆయన… ఈ భేదాలను పార్టీకి చెందిన వారు తనను సంప్రదించినప్పుడు అంతర్గతంగా మాట్లాడతానని స్పష్టం చేశారు.

తాను గత 16 సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్నాను. నాకు పార్టీతో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కానీ వాటిని పార్టీ అంతర్గతంగా మాత్రమే చర్చిస్తాను. ఇప్పట్లో ఈ విషయాలపై నేను బహిరంగంగా మాట్లాడదలుచుకోలేదు. సరైన సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను అని తెలిపారు.

ప్రధాని మోదీతో నా చర్చలు ఎంపీల ప్రతినిధి బృందానికి సంబంధించిన అంశాలపై మాత్రమే జరిగాయి. దేశానికి అవసరమైనప్పుడు, దేశ ప్రయోజనాల కోసం నిలబడటం మన బాధ్యత. దేశం నాకు సేవకోసం పిలిస్తే, నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అన్నారు.

కేరళలోని నిలంబూర్ అసెంబ్లీ నియోజకవర్గంకి జరుగుతున్న ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారానికి దూరంగా ఉన్నారు శశి థరూర్. ఎల్డీఎఫ్ మద్దతుతో గెలిచిన పీవీ అన్వర్‌ …కాంగ్రెస్‌లో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం పీవీ అన్వర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ ఆర్యాడన్ షౌకత్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన మాజీ ఎమ్మెల్యే ఆర్యాడన్ మొహమ్మద్ కుమారుడు. ఇక ఎల్డీఎఫ్ నుండి ఎం స్వరాజ్ బరిలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికల సందర్భంగా, ప్రియాంకా గాంధీ వాద్రా సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.

Also Read:కేంద్ర జల్‌శక్తి మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -