- Advertisement -
కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి తెలిపారు. బనకచర్లకు అనుమతులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు,
తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు రేవంత్. సీఆర్ పాటిల్‌తో గంటకు పైగా సాగింది సమావేశం. గోదావరి-బనకచర్లపై మాకు ఉన్న ఆందోళనలను కేంద్ర మంత్రికి వివరించాం అన్నారు మంత్రి ఉత్తమ్.
ఇది చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్టు అని తెలియజేశాం… ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజలు, రైతులలో ఆందోళనలు ఉన్నాయి అన్నారు. మేము చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకుంటామని సీఆర్ పాటిల్ హామీ ఇచ్చారు అన్నారు.
Also Read:నైపుణ్యం ఉంటేనే సక్సెస్!
- Advertisement -

