శర్వానంద్ …’శతమానం భవతి’ క్లీన్ ‘యు’

118
Shatamanam Bhavathi censor complete

ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాతగా పేరున్న దిల్ రాజు నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం “శతమానం భవతి”. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక గా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమం నేడు హైదరాబాద్ లో పూర్తి అయ్యింది. కుటుంబ కథా నేపధ్యం లో సాగే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుండి క్లీన్ U సర్టిఫికెట్ లభించింది.

Shatamanam Bhavathi censor complete

” శతమానం భవతి తాతా మనవళ్ల మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. జనవరి 14 న సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం విడుదల అవుతుంది. సంక్రాంతి కి కుటుంబ సమేతం గా చూసి ఆనందించే చిత్రం మా శతమానం భవతి. ఇది శర్వానంద్ 25 వ చిత్రం కావటం విశేషం. మిక్కీ అందించిన సంగీతం ఇప్పటికే పెద్ద హిట్ అయ్యింది. బొమ్మరిల్లు సినిమా మా సంస్థ కి ఎంత పేరు తెచ్చిందో , ఈ చిత్రం కూడా అంతే పేరుని తెస్తుంది అన్న నమ్మకం ఉంది ” అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

ఈ చిత్రం లో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ , జయసుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ – దర్శకత్వం – మాటలు – స్క్రీన్ ప్లే: సతీష్ వేగేశ్న ,ఎడిటింగ్ – మధు ,సినిమాటోగ్రఫి – సమీర్ రెడ్డి, సంగీతం – మిక్కీ జె మేయర్,నిర్మాతలు : రాజు , శిరీష్