టాలీవుడ్‌కు కుష్బూ రీ ఎంట్రీ……

145
Kushboo in Pawan-Trivikram film

నటి కుష్బూ తెలుగులో తక్కువ సినిమాలు నటించినప్పటికీ,… తమిళంలో మాత్రం ఆమె నటించిన పలు సినిమాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశాయి. పెళ్లయిన తర్వాత సినిమాలలో పెద్దగా నటించనప్పటికీ ఆమె క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. తన అందచందాలతో ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించిన కుష్బూ ఆతర్వాత తెలుగు తెరకు పూర్తిగా దూరమైంది. కొన్ని రోజులు బుల్లితెరపై యాంకర్‌గా కూడా చేసింది కుష్బూ.

Kushboo in Pawan-Trivikram film

అయితే కుష్బూ మళ్లీ తెలుగు తెరపై కనిపించనుందట. ఈవిషయాన్ని స్వయంగా తానే ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో కుష్బూ ముఖ్యపాత్ర వహించనుంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తెలుగు సినిమాలో నటిస్తున్నా. త్రివిక్రమ్‌-పవన్‌ కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నా,… త్రివిక్రమ్‌ కత్తిలాంటిస్కిప్టు రెడీ చేశారు…. అందులో నాది చాలా పవర్‌ పుల్‌ క్యారెక్టర్‌. నా గత చిత్రం మెగాస్టార్‌ చిరంజీవితో చేశా. ఇప్పుడు ఆయన తమ్ముడు సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. సినిమాల్లో మళ్లీ నటించాలని నిర్ణయం తీసుకోవడానికి చాలా కాలం పట్టింది. తెలుగులో నటించేందుకు తొమ్మిది సంవత్సరాలు. తమిళ సినిమాలు చేయడానికి ఏడు సంవత్సరాలు పట్టింది. ఇక నా అభిమానులకు నిరుత్సాహపరచని పాత్రలే ఎంచుకుంటా అని కుష్బూ ట్విట్టర్‌లో తెలిపింది.

Kushboo in Pawan-Trivikram film

మురగదాస్‌ డైరెక్షన్‌లో చిరంజీవి నటించిన స్టాలిన్‌ సినిమాలో కుష్బూ మెగాస్టార్‌కు అక్కగా నటించింది. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ పవర్‌స్టార్‌ సినిమాతో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తుంది నటి కుష్బూ. మరీ ఈ సినిమాలో త్రివిక్రమ్‌ కుష్బూను ఎలా చూపించనున్నాడో అని తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Kushboo in Pawan-Trivikram film