తెలుగులో సింగారించబోతున్న నమిత..

409
namitha

టాలీవుడ్ లో సీక్వెల్స్‌ కు ఈ మధ్య ఆధరణ బాగా పెరుగుతోంది. హాలీవుడ్ లో ఉన్న ఈ కల్చర్ మొదట బాలీవుడ్‌ కి పాకింది. బాలీవుడ్ నుంచి దానిని దక్షిణాది వాళ్లు ఇంపోర్ట్ చేసుకున్నారు. హిట్టైన సినిమాకు సీక్వెల్‌గా వచ్చి చాలా సినిమాలే విజయవంతం అయ్యాయి. ఆ కోవాలోకే రాబోతోంది గుంటూరు టాకీస్2. జబర్దస్త్ బ్యూటీ రష్మీ రెచ్చిపోయ నటించిన ఈ బోల్డ్ కంటెంట్ మూవీ బిగ్ హిట్ గా అయ్యింది. దీంతో దానికి సీక్వెల్‌ గా గుంటూరు టాకీస్ 2ను తెరకెక్కించే పనిలో పడ్డారు. అయితే ఇందులో రష్మి , శ్రద్ధాదాస్‌కు బదులుగా వేరే హాట్‌ భామలు కన్పించనున్నారు. ఈ సీక్వెల్ లో హాట్ హీరోయిన్ నమిత నటించబోతున్నట్టు ప్రచారం. ఈ సినిమాతో నమిత మళ్లీ తెలుగు తెరకు రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే బోల్ట్ కంటెంట్ తో రెచ్చిపోతున్న నమిత..మరి గుంటూరు టాకీస్2లో ఎలా సింగారిస్తుందో చూడాలి.

namitha

నమిత తో పాటు ఇందులో సన్నిలియోన్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సీక్వెల్‌ను తెలుగు, హిందీ రెండు భాషల్లో నిర్మించాలనే ప్లాన్ లో ఉండడంతో..రెండు భాషల్లో క్రేజ్ తీసుకువచ్చేందుకు ఇద్దరు హాట్ భామలు కన్పించే అవకాశం ఉంది. గుంటూరు టాకీస్ లో నరేష్‌ పాత్రకు మంచి రెస్పాన్స్ రావడంతో..ఇందులో కూడా నటించనున్నాడట. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో లేదో చూడాలి. తెలుగులో ఆఫర్లు లేకపోవడంతో నమిత తమిళ్‌కు షిఫ్ట్ అయింది. చివరిగా బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ ‘ సింహా’ లో కనిపించింది మళ్ళీ ఇన్నాళ్ళకు ఓ బోల్డ్ కంటెంట్ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతోంది.