టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ హీరోలు ఎవరు అనగానే మనకు టక్కున గుర్తొచ్చే హీరోలు ప్రభాస్, శర్వానంద్‌లు. వీళ్లిద్దరి పెళ్లికి సంబంధించిన టాపిక్ నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తూ…. వినిపిస్తూనే ఉంటుంది. నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్న ఎప్పుడెప్పుడూ పెళ్లి చేసుకుంటారా అని వాళ్ల ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా శర్వానంద్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ పలు సినిమాల్లో హీరోలుగా నటించాడు.
ఇప్పటికే నాలుగు పదుల వయసుకు చేరువలో ఉన్న శర్వాకు ఇప్పటి వరకు పెళ్లికాలేదు. అయితే తర్వాలోనే శర్వా ఓ ఇంటి వాడు కాబోతున్నాడంటూ ఓ వార్త వినిపిస్తోంది. శర్వా పెళ్లికి ఒప్పుకున్నాడని…తెలంగాణకు చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఆయన సిద్ధమయ్యినట్లు తెలుస్తోంది. అమ్మాయి అమెరికాలో సాప్ట్ వేర్ ఇంజనీర్ అని … ఆమెతో శర్వా గత కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆమె వర్క్ ప్రమ్ హోమ్ చేస్తూ హైదరాబాద్ లోన ఉంటున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే రాబోయే వేసవిలో శర్వానంద్ ఆ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేయనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే శర్వానంద్ స్పందించాల్సిందే. శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పీపుల్స్ మీడియా ప్యాక్టరీ, సితార బ్యానర్స్ లో రెండు సినిమాలు చేస్తున్నారు శర్వానంద్. మొత్తానికి శర్వానంద్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో ఆయన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.