షర్మిల చూపు తెలంగాణ వైపే!

38
- Advertisement -

షర్మిల వైఎస్‌ఆర్‌టీపీ కాంగ్రెస్‌ పార్టీలో విలీనానికి సర్వం సిద్ధమైంది. దీనిపై త్వరలోనే అఫిషియల్ ప్రకటన రానుండగా కాంగ్రెస్ పార్టీ షర్మిల సేవలను తెలుగు రాష్ట్రాల్లో ఉపయోగించుకోవాలని భావిస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీలో ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది.

అయితే షర్మిల మాత్రం తెలంగాణ రాజకీయాల వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఎందుకంటే కుటుంబపరంగా జగన్‌తో విభేదాలు ఉన్నా ఆయనతో పోటీ పడేందుకు ఇష్టపడటం లేదు షర్మిల. ఈ నేపథ్యంలోనే తొలుత తెలంగాణ రాజకీయాల వైపు ఆసక్తికనబరుస్తున్నారు.

రాహుల్ గాంధీని భారత ప్రధానిని చేయాలన్న తన తండ్రి వైఎస్ఆర్ చివరి కోరికను నెరవేర్చాలని షర్మిల భావిస్తోంది. మరికొద్ది రోజుల్లో షర్మిల పార్టీ విలీనానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుండగా పాలేరు లేదా సికింద్రాబాద్ నుండి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు షర్మిల.

Also Read:లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో “ఖుషి” టీమ్

- Advertisement -