వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు గత కొన్నాళ్లుగా గట్టిగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విలీనంపై షర్మిల ఇంతవరకు నోరు మెదపనప్పటికి.. ఆమె వైఖరి అనుసరిస్తున్న తీరు చూస్తే అడుగులు కాంగ్రెస్ వైపు వెళ్తున్నాయని చెప్పక తప్పదు. మరోవైపు టి కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే షర్మిల కాంగ్రెస్ లో చేరడాన్ని స్వాగతిస్తున్నారు. కాగా ఎన్నికలు దగ్గర పడడంతో ఇక విలీనంపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఏర్పడింది. కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డిప్యూటీ సిఎం డికె శివకుమార్ మద్యవర్తిత్వంతో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనేది షర్మిల ప్లాన్ గా తెలుస్తోంది.
ఆ మద్య డికెతో భేటీ అయిన ఆమె కాంగ్రెస్ అధిష్టానంతో కూడా సమావేశం కావాలని భావించింది. కానీ కుదరలేదు. ఇక తాజాగా డైరెక్ట్ గా సోనియా గాంధీ తో భేటీ అయ్యారు. ఈ భేటీకి ప్రధాన కారణం తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం కు సంబంధించే అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అయితే బేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల పొత్తుకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాగా ఆమె తెలంగాణలోనే పోటీ చేయాలని భావిస్తుండగా..కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆమె సేవలను ఏపీ కాంగ్రెస్ కు ఉపయోగించుకోవాలని చూస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా షర్మిల సేవలు తెలంగాణ కాంగ్రెస్ కు అవసరం లేదని ఏపీ కాంగ్రెస్ బాద్యతలు స్వీకరిస్తే తమకేలంటి అభ్యంతరం లేదని గతంలోనే చెప్పుకొచ్చారు. దీంతో షర్మిల పార్టీ విలీనంపై హస్తం హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read:నేరేడుపండుతో ఆరోగ్య ప్రయోజనాలు?