ఆగ్రాలో ప‌ర్య‌టించిన మంత్రి వేముల..

47
Minister vemula

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర రోడ్లు-భ‌వ‌నాల‌శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మంత్రి శనివారం ఆగ్రా పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మంత్రి వెంట ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి,ఈ.ఈ శశిధర్, ఆర్కిటెక్ట్ ఆస్కార్, షాపూర్ జి సంస్థ ప్రతినిధి లక్ష్మణ్ ఉన్నారు.

పర్యటనలో భాగంగా తాజ్ మహల్,రెడ్ ఫోర్ట్ లను పరిశీలించి,కట్టడాలకు వాడిన రాతి గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బడీ తలాబ్ షాహీ టౌన్ క్వారి వర్క్ షాప్,దోల్పూర్ స్టోన్‌ను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించి, క్వారీ వారిని స్టోన్ సంబంధిత వివరాలు అడిగి తెలుసుకున్నారు.