శారీరకంగానే కాదు మానసికంగా,మీటూ

22
- Advertisement -

సోనీలీవ్‌లో ప్రసారమవుతున్న నిజం విత్ స్మిత సెలబ్రిటీ టాక్‌ షో కార్యక్రమంలో ఫిదా నటి సాయి పల్లవి సందడి చేశారు. ఈ సందర్భంగా స్మిత…పలు ప్రశ్నలను సాయి పల్లవిని అడగ్గా…తన కెరీర్‌లో తగిలిన ఎదురుదెబ్బలు గురించి ఇంకా, ఎన్నో విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఓ ప్రోమోను తాజాగా విడుదలైంది.

ఈ సందర్భంగా ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్…ఈ ముగ్గురిలో ఎవరితో డ్యాన్స్‌తో చేయాలని అనుకుంటున్నావు అని స్మిత అడగ్గా…ఆ ముగ్గురూ నాతో ఒక పాట చేస్తే బాగుటుందని చెప్పుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మీటూ(#metoo) ఉద్యమం ప్రకంపనలు సృష్టించింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా పలువురు తారలు, రాజకీయ ప్రముఖులు గళమెత్తారు. ఈ ఉద్యమం గురించి మీ ఉద్దేశం ఏంటని అని స్మిత ప్రశ్నించింది. దీనికి సాయి పల్లవి…మీరు శారీరకంగా వేధింపులకు గురిచేయకపోవచ్చు. కానీ మీ మాటలతో పక్కవారిని ఇబ్బందిపెట్టినా అది వేధింపులతోనే సమానమని సమాధానిమిచ్చింది.

ప్రస్తుతం సాయి పల్లవి విరాటపర్వం, గార్గి వంటి విభిన్నమైన సినిమాలను చేసింది. కానీ ప్రస్తుతం కొత్త సినిమా అప్‌డేట్‌లు రాలేదు. అయితే గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో పుష్ప-2లో నటించే అవకాశాలు ఉందని గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరీ వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి…

ఎన్టీఆర్ డిజాస్టర్ సినిమా మళ్ళీ వస్తుంది

సమంత వచ్చేసింది.. ఖుషికి నో బ్రేక్!

ఇండస్ట్రీలో ఎన్నో చేయాలి – పూజా హెగ్డే

- Advertisement -