శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ..

252
raviteja
- Advertisement -

క్రాక్ సినిమాతో బ్లాక్ బస్ట‌ర్ హిట్ సాధించిన మాస్ మ‌హారాజ ర‌వితేజ హీరోగా శరత్ మండవ ద‌ర్శ‌క‌త్వంలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే..రియ‌ల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ర‌వితేజను ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని ఒక స‌రికొత్త పాత్ర‌లో చూపించ‌బోతున్నారు ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండ‌వ‌. ర‌వితేజ స‌ర‌స‌న దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జులై 1 నుండి హైద‌రాబాద్‌లోని అల్యుమినియం ఫ్యాక్ట‌రీలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో టీమ్ అంద‌రూ పాల్గొన‌నున్నారు. ఈ చిత్రానికి స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

ద‌ర్శ‌కుడు శ‌ర‌త్‌ మండ‌వ మ‌న తెలుగు వారే…గతంలో వెంకటేష్, అజిత్, కమల్ హాసన్, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోల సినిమాల‌కు రచయితగా పనిచేశారు.

తారాగ‌ణం:
ర‌వితేజ‌, దివ్యాంశ కౌశిక్

సాంకేతిక నిపుణులుః
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: శ‌ర‌త్ మండ‌వ‌
నిర్మాత‌: సుధాక‌ర్ చెరుకూరి
బ్యాన‌ర్‌: ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి
సంగీతం: స్యామ్ సీఎస్‌
సినిమాటోగ్ర‌ఫి: స‌త్య‌న్ సూర్య‌న్‌
ఆర్ట్: సాయి సురేష్‌
స్టిల్స్‌: సాయి రామ్ మాగంటి
పిఆర్ఓ: వంశీ- శేఖ‌ర్

- Advertisement -