శరత్ బాబు… ఇంట్రెస్టింగ్ విషయాలు

66
- Advertisement -

ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు ఆరోగ్యం క్షీణించి చనిపోయిన సంగతి తెలిసిందే. ఐతే, శరత్ బాబుగారి పర్సనల్ విషయాల గురించి తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మీకు తెలుసా ? శరత్ బాబుగారు చిన్నతనం నుంచే IPS కావాలని కలలు కన్నారు. కానీ, ఆయన ఆ తర్వాత అనుకోకుండా కళారంగం వైపు మళ్లారు. శరత్ బాబు కాలేజీ రోజుల్లోనే ఎన్నో నాటకాలు వేశారు. 1973లో వచ్చిన ‘రామరాజ్యం’లో హీరోగా తొలిసారి అడుగువేశారు. ఆ తర్వాత హీరోగా, విలన్‌గా, సహాయనటుడిగా చాలా సినిమాల్లో నటించారు. శరత్ బాబు.. తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో 250కి పైగా సినిమాలలో నటించారు.

చివరిగా పవన్‌ కల్యాణ్‌ వకీల్‌సాబ్‌ సినిమాలో కనిపించారు. సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపైనా మంచి పాత్రలు పోషించారాయన. ఈటీవీ అంతరంగాలు, జనని, అగ్నిగుండాలు సీరియల్స్‌‌లో నటించారు. శరత్ బాబు 1951 జూలై 13న శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జన్మించారు. ఆయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. అయితే సినిమాల్లోకి వచ్చాక శరత్ బాబుగా పేరు మార్చుకున్నారు. తన కుటుంబ నేపథ్యంలో, తన కులం ఏమిటో అందరికీ తెలియాల్సిన అవసరం లేదని శరత్ బాబుగా మార్చుకున్నాడని అంటుంటారు.

Also Read:IPL 2023:గుజరాత్ తో చెన్నై ఢీ.. ఫైనల్ కు వెళ్లేదేవరు!

శరత్ బాబు గారికి చిన్నతనం నుంచే కులం అంటే అసహ్యం అట. అందుకే, ఆయన వేరే కులానికి చెందిన వ్యక్తులనే పెళ్లి చేసుకున్నారు. కానీ ఆయన చేసుకున్న రెండు పెళ్లిళ్లు చివరివరకూ నిలబడలేదు. శరత్ బాబుకు ‘బెంగాలీ రచయిత శరత్ బాబు’ రచనలు అంటే చాలా ఇష్టం, అందుకే ఆయన పేరునే తన పేరుగా పెట్టుకున్నారు. ఏది ఏమైనా హీరోగానే కాకుండా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు పాత్రలతో ఆయన అలరించారు.

Also Read:డీసీపీ రాహుల్ వర్సెస్ డింపుల్ హయతి

- Advertisement -