రిజర్వేషన్ల నేపథ్యమే.. శరణం గచ్ఛామి

272
- Advertisement -

నేటి సమాజంలో రిజర్వేషన్స్ పై జరుగుతున్న చర్చ, రిజర్వేషన్ల నేపథ్యమే ఇతివృత్తంగా శరణం గచ్ఛామి చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్ ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని మరో నెలరోజుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాత బొమ్మకు మురళి తెలిపారు. అనుకున్నదానికంటే సినిమా బాగా వచ్చిందని, తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు .బొమ్మకు క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ్‌రాజ్‌ దర్శకత్వంలో బొమ్మకు మురళి  “శరణం గచ్ఛామి”ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం రఫ్ వెర్షన్ చూసిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, టి.ఆర్.ఎస్. వ్యవస్థాపక సభ్యుడు వి. ప్రకాష్ మాట్లాడుతూ “ఈ రోజుల్లో సినిమాను కేవలం వ్యాపారంగా చూసే కొందరు అర్థం పర్థం లేని చిత్రాలు నిర్మిసూ ప్రేక్షకుల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు. సినిమా అనేది సమాజానికి ప్రతిబింబం. పొరుగున ఉన్న తమిళ, మళయాళ దర్శకులు ఎన్నో కొత్త ప్రయోగాలు చేస్తుంటే ఇక్కడ మాత్రం మూస ధోరణిని విడిచిపెట్టడం లేదు. ఈ చిత్ర నిర్మాత బొమ్మకు మురళి వ్యాపార దృక్పథంలో కాకుండా ఒక మంచి సినిమా నిర్మించాలనే తపనతో ఈ సినిమా చేయడం అభినందనీయం. ఈ సినిమా దర్శకుడు ప్రేమ్‌రాజ్‌తో నాకు చాలా ఏళ్ళుగా అనుబంధం ఉంది. తను అందరిలా కాకుండా తన మొదటి చిత్రం ‘నగరం నిద్రపోతున్నవేళ’ ‘ఆకాశంలో సగం’ నుండి మంచి అభిరుచి గల చిత్రాల్ని తీస్తున్నాడు. ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదం పంచుతూనే మంచి మెసేజ్ ఇస్తుంది. ఇలాంటి సినిమాలు ఆడితే ఇంకా ఎంతోమంది మంచి సినిమాలు తీయడానికి ప్రేరణ అవుతుంది” అన్నారు.

నవీన్ సంజయ్, తనిష్ తివారీ జంటగా నటించిన ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్రెడ్డి, పరుచూరి వెంటేశ్వరరావు, ప్రముఖ బి.సి. ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య, దేశపతి శ్రీనివాస్, కాశీ విశ్వనాధ్, ఫిష్ వెంకట్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి కెమెరా : కళ్యాణ్ సమి, సంగీతం : రవి కళ్యాణ్, ఎడిటింగ్ : సత్య గిడుతూరి, ఫైట్స్ : రాబిన్ సుబ్బ, కొరియోగ్రఫి : ప్రకాష్ వి. జోసెఫ్, కో-డైరెక్టర్ : ప్రభాకర్, కథ, స్క్రీన్ప్లే, నిర్మాత : బొమ్మకు మురళి, మాటలు, దర్శకత్వం : ప్రేమ్రాజ్

- Advertisement -