మహా అప్‌డేట్స్‌…సోనియాతో పవార్ భేటీ

694
pawar sonia
- Advertisement -

మహారాష్ట్రలో శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కాంగ్రెస్,ఎన్సీపీ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. కామన్ మినిమమ్ ప్రొగ్రామ్‌పై ఇప్పటికే మూడు పార్టీలు ఓ అభిప్రాయానికి రాగా ఇక ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో భేటీ కానున్నారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌.

న్యూఢిల్లీలో జరిగే ఈ భేటీలో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించనున్నారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు నేటితో ముగింపు పలకాలని శరద్‌పవార్ భావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రితో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు తెరపడాలని తమ పార్టీ భావిస్తోందని చెప్పారు ఎన్సీపీ భావిస్తోందని…. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు కావాలన్న మంచి ఉద్దేశంతో తాము ముందుకువెళ్తున్నామని చెప్పారు ఆ పార్టీ సీనియర్ నేతనవాబ్ మాలిక్ .

సోనియాతో పవార్ భేటీ అనంతరం మంగళవారం రెండు పార్టీలకు చెందిన ఇతర నాయకులు సమావేశమై భవిష్యత్ ప్రణాళికపై చర్చించనున్నారు. ఇక ఇవాళ శివసేన నాయకులతో భేటీ కానున్నారు మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు.

NCP’s Sharad Pawar, Sonia Gandhi To Meet Today After it was reported on Saturday that a common agenda had been worked out

- Advertisement -