రాహుల్ పునర్ణవి జంటగా త్వరలో సినిమా

466
Rahul Sipligunj Punarnavi

సింగర్ రాహుల్ బిగ్ బాస్ 3 తర్వాత చాలా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఆయన ముక్కు సూటి తనంతో చాలా మంది రాహుల్ కు అభిమానులయ్యారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాహుల్ కు భారీగా ఆఫర్లు వస్తున్నాయి. ఓ వైపు సింగర్ చేస్తూ మరోవైపు సినిమాల్లో నటించేందుకు ఆఫర్లు కూడా వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ పునర్ణవి జంటగా అందరిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఇలాంటి వార్తలను వారిద్దరూ కొట్టిపారేస్తున్నారు.

punarnavi Rahul

తామిద్దం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతున్నారు. త్వరలోనే వాళ్లు పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. ఇక తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గోన్న రాహుల్ పునర్నవితో కలిసి నటించే అవకాశం వస్తే ఎట్టి పరిస్ధితుల్లో వదలుకోనని చెప్పారు. దాంతో ఓ నిర్మాత వీరిద్దరితో కలిసి సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఈ ఇద్దరిపై ఒక ప్రేమకథను రూపొందించడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడని అంటున్నారు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ఓ యువ దర్శకుడు ఈ సినిమాకి పనిచేయనున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. మరి రాహుల్ తో నటించేందుకు పునుర్ణవి సుముఖంగా ఉందా లేదో చూడాలి.

Biggboss Fame Rahul sipligunj And Punarnavi Acting In Movie