మనందరం బాధ్యతగా మొక్కలు నాటాలి..

268
Green India Challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా అద్భుతంగా ముందుకు కొనసాగుతుంది. దీనిలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా సౌత్ కొరియా కన్సల్టెంట్ జనరల్ సురేష్ చుక్కపల్లి ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి ఈరోజు తమ నివాసాలలో మొక్కలు నాటారు శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, సన్ షైన్ హాస్పిటల్ చైర్మన్ గురువా రెడ్డి.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని నివారించాలంటే మనందరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని.. ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ మానవ మనుగడ ఆరోగ్యకరంగా ఉంటుందన్నారు. కాబట్టి ఈ రక రకాల వ్యాధుల నుండి మనము బతుకు జీవనం కొనసాగించాలంటే మంచి వాతావరణం కావాలని మన భవిష్యత్ తరాలకు మనం ఇచ్చేది మంచి వాతావరణంమే అన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేశారు.

- Advertisement -