ఎన్టీఆర్‌తో శంకర్‌…న్యూస్ వైరల్!

121
ntr
- Advertisement -

పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ దర్శకుడు శంకర్. ఆయన దర్శకత్వంలో సినిమా చేసేందుకు హీరోలంతా ఎదురుచూస్తారు. ప్రస్తుతం కమల్‌తో భారతీయుడు,చరణ్‌తో ఓ సినిమా చేస్తుండగా కమల్‌ సినిమా ఆగిపోయింది. అయితే తాజాగా టీ టౌన్‌లో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.

చరణ్‌తో సినిమా తర్వాత తారక్‌తో సినిమా చేయనున్నారట శంకర్. ఇందుకోసం ఓ ప్రత్యేక కథను సిద్ధం చేశారని త్వరలోనే ఎన్టీఆర్‌కి వినిపించబోతున్నారట. ఒకవేళ శంకర్‌ ప్రాజెక్టుకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఫ్యాన్స్‌కు పండగే.

రామ్‌చరణ్‌తో తెరకెక్కిస్తున్న సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, అంజలి, శ్రీకాంత్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఒక నిజాయితీ కలిగిన అధికారి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొరటాల శివ తో సినిమా మొదలు పెట్టిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ఒకవేళ ఎన్టీఆర్..శంకర్‌ సినిమా ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది.

- Advertisement -